డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన రంగస్థలం సింగర్

Saturday, July 28th, 2018, 10:40:17 AM IST

టాలీవుడ్ లో పాపులర్ సింగర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగoజ్ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అతను లైసెన్స్ లేకుండా బండి నడిపినట్లు తెలుస్తోంది. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్‌ వైపు వస్తున్న రాహుల్‌ కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 178 పాయింట్లు వచ్చినట్లు సమాచారం. ఇక అతనితో పాటు నటుడు యాంకర్ లోబో కూడా ఉన్నాడు. తాగిన మైకంలో ఉన్న రాహుల్ పోలీసులకు సహకరించకపోవడంతో కొంత గొడవకు దారి తీసినట్లు సమాచారం. చివరికి కారును సీజ్ చేసి పోలీస్ కేసు నమోదైనట్లు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. రాహుల్ ఇటీవల రంగస్థలం సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా అంతకుముందు పూర్‌ బాయ్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments