హంటింగ్ స్టార్ట్..నయీమ్ కేసులో టిఆర్ఎస్ చోటా నేత అరెస్ట్..!

Tuesday, September 27th, 2016, 02:12:46 PM IST

nayeem
నయీమ్ కేసులో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల ఏరివేతను సిట్ అధికారులు మొదలు పెట్టారు.ఈ ప్రక్రియను చోటా నేతలనుంచి మొదలు పెట్టారు.మొదట సిట్ అధికారులు అధికార పార్టీ నుంచే మొదలు పెట్టారు. నయీమ్ తో లింకులున్న రాజకీయ నేతలు అన్ని పార్టీ లలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యం లో సిట్ అధికారులు నయీమ్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న మహబూబ్ నగర్ టిఆర్ఎస్ నేతను అరెస్ట్ చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా వెల్డండ మండలం టిఆర్ఎస్ అధ్యక్షుడు బల్లె ఈశ్వరయ్య ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈశ్వరయ్య మహాబునగర్ జిల్లాలో నయీమ్ వ్యవహారాలు మొత్తం చూసుకునేవాడని వార్తలు వస్తున్నాయి.నయీమ్ చేసిన అక్రమ భూ దందాలు, వసూళ్ళలో ఇతను పాలు పంచుకున్నాడని వార్తలు రావడంతో సిట్ అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. అతని నుంచి నయీమ్ కు సంబందించిన మరింత సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టనున్నారు.ఇతని నయీమ్ సంబంధాల విషయం లో సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారని సమాచారం. మునుముందు సిట్ అధికారులు నయీమ్ తో సంబంధాలు ఉన్న బడా రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.