మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మహాత్ముడా? : శివాజీ

Friday, September 14th, 2018, 07:20:29 PM IST

గత కొంత కాలంగా సినీ నటుడు శివాజీ ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఎవరు ఊహించని విషయాల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత జనతాపార్టీని ఉద్దేశించి ఏపి రాజకీయాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నట్లు మరోసారి కుండా బద్దలు కొట్టారు. అదే విధంగా ఆయన గతంలో చెప్పిన ఆపరేషన్ గరుడను ఆపరేషన్ పెరుగు వడ అంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శివాజీ ఆగ్రహంతో స్పందించారు.

శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. అలా అనడానికి నాకేమి పని పాట లేదా? మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మహాత్ముడా? రోజు రెండు లక్షల మంది ఆయన వెనక తిరగడానికి జనాలేమైనా పిచ్చోళ్లా? ఆయనేమైనా గాంధీలా త్యాగాలు చేశాడా? లేక పోరాటాలు చేశాడా? ది గ్రేట్ రాజశేఖరరెడ్డి గారి కుమారుడు… అంతవరకు నేను ఒప్పుకుంటా. ఎందుకంటే రాజశేఖర్ గారికి గొప్ప చరిత్ర ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. జగన్ వెనుక తీరుగుతున్న లక్షలాది మంది జనాలకు ఏమి పనిపాట లేదా? అన్ని రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని చెబుతున్నా.

సభల కోసం రాజకీయ పార్టీలు లక్షలు ఖర్చు పెడుతున్నాయని అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్న పెట్టుబడి ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా జగన్ ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారని విశాఖలో ఉన్న జగన్ రైల్వే జోన్ కోసం ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. రాజకీయ స్వార్ధం కోసం ప్రతిరోజు కులాల మీటింగ్ లు మతాల మీటింగ్ లు చేస్తున్నారని ప్రత్యేక హోదా గురించి పట్టించుకుంటేనే జగన్ ని జనాలు ఎన్నికల్లో గెలిపిస్తారని శివాజీ మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments