ఏపీ రాజ‌కీయాల్లో సెన్షేష‌న్.. హీరో శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Thursday, November 1st, 2018, 04:29:15 PM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై హ‌త్యా య‌త్నంలో భాగంగా క‌త్తితో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే న‌టుడు శివాజీ ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా ఇలాంటి దాడి జ‌రుగుతుంద‌ని ఏడు నెల‌లు క్రింద‌టే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో శివాజీకి జ‌గ‌న్ పై దాడి జ‌రుగుతుంద‌ని ముందుగానే ఎలా తెలుస‌ని.. ఈ కుట్ర పై అనేక అనుమానాలు ఉన్నాయ‌ని.. దీంతో శివాజీని ప‌ట్టుకుని విచార‌ణ జ‌ర‌పాల‌ని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న శివాజీ అక్క‌డి నుండే తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆశ‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆపరేషన్ గరుడ గురించి ఫ‌స్ట్ తాను విన్న‌ప్పుడు కూడా కామెడీగా ఉంద‌ని అనుకున్నానని, ఆ త‌ర్వాత మొత్తం విష‌యం తెలిశాక నేను ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాన‌ని అయితే న‌న్ను అంద‌రూ లైట్ తీసుకున్నార‌ని శివాజీ అన్నారు. ఇక ఏపీకి జ‌రిగిన అన్యాయం పై ఒక్క‌డై పోరాడుతున్న చంద్ర‌బాబు పోరాటాన్ని తాను ఆహ్వానిస్తున్నాని, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం చంద్ర‌బాబు ఎంతో తపన పడుతున్నానని శివాజీ బ‌హిరంగంగానే.. చంద్ర‌బాబు పాల‌న‌ను పొగుడు తున్నారు. ఇక‌ త‌నపై అన‌వ‌స‌రంగా ఆరోప‌ణ‌లు చేస్తే వైసీపీకే న‌ష్ట‌మ‌ని శివాజీ అన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేనలు త్వరలో కలిసిపోవచ్చునని శివాజీ జోస్యం చెప్పారు. ఇక తాను చ‌నిపోయేలోపు క‌చ్ఛితంగా టీటీడీ చైర్మన్‌ అయి తీరుతానని శివాజీ ప్రకటించారు. దీంతో పెద్ద పెద్ద మ‌హా మ‌హుల‌కే టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌దు అలాంటిది శివాజీ తాను ఎప్ప‌టికైనా టీటీడీ చైర్మ‌న్ అవుతాన‌ని ప్ర‌క‌టించడంతో శివాజీ- చంద్ర‌బాబు దోస్తీ పై ప‌లు అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఆప‌రేష‌న్ గ‌రుడ ఫేం ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారార‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.