వివేకా హత్యకు పక్కా స్కెచ్ వేశారా…?

Saturday, March 16th, 2019, 09:43:33 AM IST

వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది, పోస్ట్ మార్టంలో వివేకాను హత్య చేసారని తేలిన సంగతి తెలిసిందే తాజాగా, ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి ఇంటి చుట్టూ ఎప్పుడూ తిరుగాడే ఒక కుక్కను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. వివేకా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే మొరిగే ఆ కుక్కను మర్డర్ ప్లాన్‌లో భాగంగానే చంపేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కుక్క గనక ఉంటే వివేకా ఇంటికి వెళ్ళటం సాధ్యపడదని భావించి ముందుగానే దాని హతమార్చి ఉంటారని అంటున్నారు.

హత్యకు పాల్పడే ముందు నిర్వహించిన రెక్కీలో భాగంగానే ఆ కుక్కను గమనించిన హంతకులు దాన్ని ముందే చంపేసి అడ్డు తొలగించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.కాగా, పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగింది. అయితే, వివేకాను హత్య చేసారని, గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారని తేలడం అందరిని షాక్ కి గురి చేసింది. ఈ హత్యోదంతం పై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు జగన్ ఆయన్ను ఈ రోజు కలవనున్నారు.