టీడీపీలో రాజుకున్న అసమ్మతి గళం – కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు

Thursday, March 14th, 2019, 05:16:34 PM IST

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఎలాగైనా ఈసారి కూడా విజయం సాధించే దిశగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నప్పటికీ కూడా తన పార్టీ లోనే కొందరిలో అసమ్మతి సెగలు నెలకొంటున్నాయి. కేవలం టీడీపీ పార్టీకి కంచుకోటలా ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు చెందిన కీలకమైన నాయకుడు, మాజీ మంత్రి, స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు వ్యతిరేకంగా తెలుగు కార్యకర్తలు కొందరు నినాదాలు చేస్తున్నారు. అయితే కేవలం కోడెల కుటుంబానికే 3 టిక్కెట్లు కావాలని చంద్రబాబుని కోరాడు. అది కుదరకపోవడంతో చివరికి తన కుమారుడికైనా టికెట్ ఆశించారు.

గతంలో టీడీపీ తరపున కోడెల గెలుపొందిన నియోజకవర్గంలో ప్రస్తుతానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోడెల కుటుంబం చేసే అన్యాయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది. సత్తెనపల్లి టీడీపీలోనే కోడెలకు వ్యతిరేకంగా నాయకులు ఒక్కటయ్యారు. సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన సత్తెనపల్లి టీడీపీ నాయకులు “కోడెల హఠావో.. సత్తెనపల్లి బచావో“-నినాదాలతో హోరెత్తించారు. ఎట్టిపరిస్థితిలోనూ కోడెలకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వద్దని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.