ఈ చిన్న హీరోయిన్ తెలంగాణ ఎన్నికల్లో గెలుస్తుందా ?

Thursday, December 6th, 2018, 01:42:00 PM IST

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ హీరోయిన్ ఒకరు పోటీకి దిగుతోంది. ఆమే రేష్మ రాథోర్. ‘ఈరోజుల్లో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె రాజకీయాలపై ఆసక్తితో ప్రజాసేవ చేస్తానంటూ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది. భాజపా కూడ ఆమెకు మంచి ప్రాధానిమిచ్చి స్టేట్ సెక్రెటరీగా నియమించింది. అడిగిన వెంటనే ఖమ్మం జిల్లా వైరా నుండి ఎమ్మెల్యే టికెట్ కూడ ఇచ్చింది.

ప్రచార కార్యక్రమంలో రేష్మ బాగానే పాల్గొంది. ఆమెకు ప్రత్యర్థులుగా మహాకూటమి నుండి బానోత్ విజయ, తెరాస నుండి గతంలో వైకాపా తరపున గెలిచిన బానోత్ మదన్ లాల్ బరిలో ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఆమెకు గెలుపు అంత ఆషామాషీ విషయం కాదు. కానీ ఆమె సినిమా తార అయి ఉండటం, మంచి విద్యావంతురాలు కావడం, ఆమె తండ్రి హరిదాసు రాథోర్ సింగరేణిలో పెద్ద పదవిలో పనిచేసి ఉండటం, తల్లికి న్యాయవాదిగా మంచి గుర్తింపు ఉండటం, ఈ నియోజవర్గంలో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండటం, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు లాంటి పెద్ద హామీ ఇచ్చి ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. మరి వైరా ఓటర్లు ఈమెను ఆదరించి పట్టం కడతారో లేదో తెలియాలంటే 11 వరకు ఆగాల్సిందే.