యువతకు స్మార్ట్ ఫోన్ లతో పాటు కోటి ఉద్యోగాలు : రాహుల్ గాంధీ

Saturday, April 28th, 2018, 03:40:28 AM IST

త్వరలో కర్ణాటక అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ సహా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే నేడు యూపీఏ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ బెంగళూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజల కష్టనష్టాల్లో తాము భాగస్వాములం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే యువతకు కోటి ఉద్యోగాలతో పాటు స్మార్ట్ ఫోన్లను అందిస్తామని అన్నారు. అలానే మహిళల భద్రతకు కూడా ప్రధమ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

ప్రధాని మన్ కీ బాత్ ప్రజలు వినడం కాదు, ప్రజల మనసులోని మాటలు కాంగ్రెస్ వింటుంది అన్నారు. ఇంతకముందు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో దాదాపుగా 95 శాతం హామీలు నెరవేర్చాం, కర్ణాటకకు ఎంతో సుపరిచితులైన వీరప్ప దేశంలోని ప్రజలందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు వేస్తాను అన్న ప్రధాని మోడీ, కనీసం ఒక్కరూపాయి కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. అవినీతికి మేము పూర్తిగా వ్యతిరేకం అన్న ఆయన ప్రస్తుతం అవినీతిపరులను వెంటపెట్టుకుని తిరుగుతున్నారు అన్నారు. బిజెపి సిద్ధాంతాలు, భావజాలంలో ఆర్ ఎస్ ఎస్ మేనిఫెస్టో ను పోలివుంది, ఎందుకంటే అందులో అవినీతి నిర్మూలిస్తామని ఎక్కడ ఉండదు.

కర్ణాటక ప్రజలంటే మాకు బిజెపి కన్నా ఎక్కువ తెలుసు. ఇక్కడి ప్రజల సిద్ధాంతాలను గౌరవిస్తాము, ముఖ్యంగా బసవన్న సిద్ధాంతమంటే మరింత గౌరవమని, మాకు ఏ ఒక్క ప్రాంతమో, లేక జిల్లానో అంటే ప్రేమ లేదని, అన్ని ప్రాంతాలవారు మాకు సమానమే అన్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీ గా చెప్పుకునే బెంగళూరు మహానగరం ఈ రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడాలి అన్నారు. అంతేకాదు ఇక్కడివారికి మరింత చేయూతనిస్తే మనదేశ ప్రతిష్ట అమాంతం పెరుగుతుంది. కాంగ్రెస్ ఈ దిశగా ఆలోచన చేస్తోంది అన్నారు. అందుకే మా మానిఫెస్టో ద్వారా ప్రజా గొంతుక వినిపించాలనుకుంటున్నాం అన్నారు. కాగా 224 స్థానాలకు కర్ణాటకలో మే 12న జరగనున్న ఎన్నికలు మంచి రసవత్తరంగా మారాయి. ఇక్కడ తెలుగు వారు ఎక్కువగా వున్న కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మెగా స్టార్ చిరంజీవిని ఎన్నికల ప్రచారంలో భాగస్వామిని చేయాలనుకుంటోంది……

  •  
  •  
  •  
  •  

Comments