పాము పాలు తాగడం చూశాం.. కానీ నీళ్ళు తాగడం చూశారా..? ఈ వీడియో చూడండి

Tuesday, April 3rd, 2018, 12:59:13 PM IST

ఎహె.. ఎక్కడైనా పాము పాలు తాగడం చూశాం. కానీ.. పాము నీళ్లు తాగడమేంది. అసలేంది మాకీ రచ్చ అనుకుంటున్నారా..? అందుకే మరి.. ఈ వీడియో అంత వైరలయింది. పాము పాలు తాగడం వార్త కాదు.. కానీ పాము నీళ్లు తాగడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. యూఎస్‌లోని టెక్సాస్‌లో పెట్ పామును పెంచుకుంటున్న ఓ వ్యక్తి ఇలా తన పెట్ స్నేక్ నీళ్లు తాగుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పాము పేరు సెలియా. నెటిజన్లు కూడా ఆ పాము కలర్‌కు, అది ఎంతో ముద్దుగా నీళ్లు తాగే విధానానికి ఫిదా అయిపోతున్నారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాదు మిగితా పెట్ స్నేక్ లవర్స్ కూడా వాళ్ల పాము నీళ్లు తాగిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పాములు నీళ్లు తాగడంపై చర్చ నడుస్తున్నది. మొన్న పాలు, ఇవాళ్ళ నీళ్ళు, మరి రేపు ఏం తాగుతాయో..