ఎసి కోసం పాము ఎక్కడికి వెళ్లిందో తెలుసా?

Saturday, June 2nd, 2018, 12:15:11 AM IST

మండే ఎండలకు మనిషే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. రోజు రోజుకి సూర్యుడి ప్రతాపం ఎక్కువవుతోంది. వడదెబ్బకు కదలలేని పరిస్థితి. మనిషే తట్టుకోలేక కుప్పకూలిపోతుంటే ఇక సాధారణ చిన్న చిన్న ముగా జీవుల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. మనిషి పడిపోతే నలుగురు వచ్చి లేపగలరు. కానీ ముగా ప్రాణులు ఎన్నో తెలియకుండానే సూర్యుని వేడికి చనిపోతుంటాయి. ఇకపోతే చల్లదనం కోసం ఇటీవల ఓ పాము ఎక్కడికి వెళ్లిందో తెలిస్తే షాక్ అవుతారు.

నైరుతి చైనాలో ఎండల తీవ్రత ఎక్కువవుతుండడం అందరిని కలవరపరుస్తోంది. అయితే స్థానికంగా ఉండే ఒక పాటశాలలోకి ఒక ఎవరి కంటా పడకుండా ఓ పాము చొరబడింది. అంతే కాకుండా ఎసి క్లాస్ రూమ్ లోకి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ స్కూల్ కి చెందిన ఓ టీచరే దాన్ని పట్టుకొని సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేసారట. ఇక పాము వచ్చినధీ ఎసి కోసమే అని క్లాస్ రూమ్ లో చల్లగా ఉండటం వలన అక్కడికి వెళ్లినట్లు టీచర్ తెలిపారు. 3.3 అడుగుల పొడవు ఉన్న ఆ పాము కరిచినా పెద్దగా నష్టమేమి లేదని విషపూర్తియమైనది కాదని ఆ స్కూల్ టీచర్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments