ఇంట్లోకి వచ్చిన పాము.. చివరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది!

Tuesday, May 8th, 2018, 03:46:18 PM IST

సాధారణంగా దూరం నుంచి పాము లాంటి ఆకారంలో ఉన్న తీగ కనిపించినా మనిషి భయపడే విధానం ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాగే నిజమైన పాము కనిపిస్తే..అది కూడా విషపూరితమైన నాగు పామైతే భయం డోస్ చాలానే పెరుగుతుంది. దీంతో ఎలాగైనా దాన్ని చంపేయాలని అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తాచు పాము గాయపడిన విధానాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా దాన్ని బ్రతికించాలని ఆపరేషన్ చేసే విధంగా ఏర్పాట్లు చేశాడు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని ఒక ఇంట్లో ఒక పొడవైన విష తాచు పాము నక్కిందని స్థానికులు తెలుసుకున్నారు. వెంటనే స్నేక్‌ సేవర్‌ సొసైటీకి సమాచారం ఇచ్చారు. కానీ పాము ఒక్కసారిగా బయటకు రావడంతో కరుస్తుందని బయపడి కొందరు దానిపై కర్రలతో దాడి చేశారు. నడుముపై గట్టిగా కొట్టిగా పాము ఎటు వెళ్లలేకపోయింది. అయితే అంతోలోనే వచ్చిన స్నేక్‌ సేవర్‌ సొసైటీ టీమ్ అధ్యక్షుడు చదలవాడ క్రాంతి దాన్ని చంపకుండా అందరిని ఆపేశాడు. అంతే కాకుండా స్థానిక పశు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి పాముకి ఆపరేషన్‌ చేసి కుట్లు వేశారు. దీంతో పదిరోజుల్లో పాము కోలుకుంటుందని వైద్యులు తెలిపారు.

Comments