చిన్నపాము పెద్ద పాముతో ఏం చేసిందంటే..?

Saturday, June 9th, 2018, 05:04:00 PM IST

సాధారణంగా పాములు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెండిటిలో ఏ పాము గెలుస్తుందో ఈజీగా చెప్పవచ్చు. చిన్న పాములను పెద్ద పాములు ఈజీగా మింగేయగలవవు. యూ ట్యూబ్ లో ఎక్కడ వెతికినా అలాంటి వీడియోలే కనిపిస్తాయి. కానీ విచిత్రంగా ఇటీవల జరిగిన సంఘటన మాత్రం అందరిని ఆశ్చర్యనికి గురి చేస్తోంది. చిన్న పాము ఒక పెద్ద పాముతో పోట్లాడుతూ దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.

ఒడిశాలో జరిగిన ఈ ఘటన యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు వివరాల్లోకి వెళితే.. కోరపుత్‌ జిల్లా సునబేదా పట్టణంలోని ఒక ఇంటి సమీపాన ఒక పాము ఉన్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే వచ్చిన జంతు సంరక్షణ సభ్యులు అక్కడ ఘటనను చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు గంటపాటు ఒక చిన్న పాము తనకంటే మూడు అడుగులు మరియు బలంగా ఉన్న రాటిల్ స్నేక్ ను పట్టు వదలకుండా పోరాడింది. పెద్ద పాము ఎంత విడిపించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అస్సలు చిన్న పాము వదల్లేదు. చివరికి జంతు సంరక్షణ అధికారులు వాటిని విడిపించి అడవి ప్రాంతంలో వదిలేశారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

via GIPHY