సోషల్ మీడియా బ్యూటీ: బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేస్తే మరింత పాపులర్ అవుతా..!

Friday, May 17th, 2019, 01:55:40 PM IST

బిగ్‌బాస్ షో అంటే ప్రస్తుతం తెలియని వారుండరు. హిందీ, తెలుగు, తమిళ్ వర్షన్లలో సాగుతున్న ఈ ప్రోగ్రాంలు ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షోలుగా మారాయి. అయితే ప్రస్తుతం హిందీలో జరుగుతున్న బిగ్‌బాస్ ప్రోగ్రాం ఇప్పటికే 12 సీజన్లను పూర్తి చేసుకుని 13వ సీజన్‌లోకి అడుగెట్టబోతుంది. ఎంతో పాపులర్ అయిన ఈ హిందీ షోలోకి కంటెస్టెంట్లుగా సెలబ్రెటీలను, ప్రముఖులనే కాకుండా మామూలు పేరు కలిగిన వారిని కూడా తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వ్యక్తి ఒకరు నాకు బిగ్‌బాస్ 13వ సీజన్‌లో పార్టిసిపేట్ చేయాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎల్లో కలర్ శారీ కట్టుకుని, సాన్ గ్లాసెస్ పెట్టుకుని, ఓక్ చేతిలో ఫోన్ మరో చేతిలో ఈవీఎం పట్టుకుని, మెడలో ఐడీ కార్డ్ వేసుకుని వయ్యారాంగా నడుస్తూ వస్తున్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇంతకి ఆమె ఎవరనేది మీకు ఇదివరకే అర్ధమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎన్నికల సమయంలో విధులకు హాజరవుతున్న రీనా దివేది, ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి. అయితే ఆమె ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఇప్పుడు తాను ఒక సెలబ్రెటీ అయిపోయింది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని సరికొత్త వ్యాఖ్యలతో మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ఆమెకు బిగ్‌బాస్ 13 వ సీజన్‌లో పార్టిసిపేట్ చేయాలని ఉందట. తనకు ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు వస్తుందని, బిగ్‌బాస్‌ వంటి షోలలో పాల్గొంటే మరింత పేరు వస్తుందని ఆమె చెప్పింది. అంతేకాదు తను ఎప్పుడూ అందంగా ఉండడానికి కోరుకుంటానని, మంచి చీరలు, డ్రెస్సులు అన్నా తనకు చాలా ఇష్టమని, ఉద్యోగంలో బిజీగా ఉన్నా, ఎక్కడైనా ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నా కానీ నేను అందంగానే కనపడడానికి ఇష్టపడుతానని చెప్పుకొచ్చింది. అయితే ఇంత అందంగా ఉండే ఈమెకు తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడంటే ఎవరికి నమ్మశఖ్యం కావడం లేదట.