సోషల్ మీడియాలో పుకార్లు.. నిజాలు తెలుసుకోకుండా జనాల దాడులు!

Monday, May 28th, 2018, 08:35:11 PM IST

ప్రస్తుతం జనాల్లో సోషల్ మీడియా ఫోబియా ఎక్కువైందని చెప్పాలి. ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అయ్యేలా చేయాలనుకోవడం ఫాషన్ అయిపొయింది. ఉపయోగం లేని ఆనందం కోసం అబద్దాలను సృష్టించి ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగ్ లు సంచరిస్తున్నాయని ఒక న్యూస్ ను బాగా వైరల్ చేశారు. అలాగే కొన్ని వీడియోలను ఉదాహరణగా చూపించి భయాన్నీ తెప్పిస్తున్నారు.

అయితే ఆ విషయం తెలియక జనాలు కొంత మంది అనుమానితులపై దాడులకు దిగుతున్నారు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సమూహంగా దాడి చేస్తున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో చాలా వరకు కొంత మంది అమాయకులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని తెలిసింది. ఇటీవల హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట సమీపంలో ఇదే విధంగా ఓ నలుగురి ట్రాన్స్ జెండర్స్ పై జన సమూహం దాడికి దిగింది. మహబూబ్ నగర్ ప్రాంత వసూలైన నలుగురు హిజ్రాలు రంజాన్ సందర్బంగా హైద్రాబాద్ కు రాగా చంద్రయాన్ గుట్టలో కొంత మంది కాలని వాసులు వారిని పట్టుకొని ప్రశ్నించారు. పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ అని అనుమానపడి ఇష్టం ఉన్నట్లు దాడి చేశారు. ఈ దాడిలో ఒక ట్రాన్స్ జెండర్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు విషయం తెల్సుకొని విచారించగా వారు పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ కాదని కనుగొన్నారు.

ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా వాట్సాప్ సోషల్ మీడియాలో వస్తున్న మెస్సేజ్ లకు అనుమానపడి చాలా మంది అమాయకులపై దాడులు చేస్తున్నారు. అలాగే 500 మంది బీహార్ నుంచి దిగారని చంపడమే టార్గెట్ గా పెట్టుకున్నారు అన్నట్లు ఫెక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ తరహా విషయాలను ఎక్కువగా నమ్మవద్దని ఎవరిపైనా అయినా అనుమానం కలిగితే 100 కు డయాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు తెలియజేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments