వైసీపీ కాస్త కామెడీ పార్టీగా మారిపోతుందా..?

Thursday, March 14th, 2019, 01:55:53 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావం పూరించబడింది.ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు బలమైన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా ఉండబోతుందని ఇప్పటికే అర్ధమవుతుంది.అయితే ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే రాజకీయ పార్టీల్లో వలసల పర్వం మొదలవుతుందన్న సంగతి తెలిసినదే..అలాగే మన దగ్గర కూడా ఇప్పుడు అధికంగా వలసలు వస్తున్న పార్టీ ఏదన్న ఉంది అంటే అది ప్రతిపక్ష నేత జగన్ యొక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పాలి.ఇప్పటికే చాలా మంది నేతలు చంద్రబాబును వీడి జగన్ చెంతకు చేరుతుంటే..మరో పక్క సినీ పరిశ్రమ నుంచి కూడా వైసీపీలోకి వలసలు భారీ ఎత్తునే వస్తున్నాయి.

అయితే సినీ పరిశ్రమ నుంచి మాత్రం బాగా పేరున్న నటులు అరకొరగా అక్కడక్కడా కనిపిస్తుంటే ఎక్కువ శాతం హాస్య నటులే కనిపిస్తున్నారు.పోసాని,పృథ్వీ,కృష్ణుడు, ఈ మధ్యనే అలీ మరియు రాజా రవీంద్ర, ఇప్పుడు తాజాగా అంబటి శ్రీనివాస్ లు చేరుతున్నారు.దీనితో సోషల్ మీడియాలో వైసీపీ మరియు జగన్ పైన ఓ రేంజ్లో సెటైర్లు పడుతున్నాయి.వైసీపీ కాస్తా కామెడీ పార్టీగా మారిపోతుందని,దానికి తోడు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారంతా వైసీపీ నే ఎంచుకోడం ఇతర పార్టీల అభిమానులకు మరింత బలం చేకూర్చింది.దానితో వారు వైసీపీ పై మరిన్ని ట్రోల్ల్స్ వేస్తున్నారు.మరి ఈ వలసల పర్వం ఇంకెక్కడ ఆగుతుందో చూడాలి.