ఐ లవ్ యు అని మెసేజ్ పెట్టి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య….

Sunday, August 5th, 2018, 12:28:57 PM IST

కొంత కాలంనుండి అర్ధంలేని కారణాలతో కొందరు తమ నిండు నూరేళ్ళ జీవితాన్ని ఆత్మహత్యలతో బలిచేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా యువత చిన్న చిన్న కారణాలతో తమ చనువును చాలిస్తూ, తమను కన్నవారికి, అయినవారికి గుండెకోతను మిగులుస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణం అందరిని కలిచి వేసింది. విషయం ఏమిటంటే, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ నాలుగు నెలల క్రితం గచ్చి బౌలి ప్రాంతంలోగల ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ సమయంలో అతడు ఒకయువతిని ప్రేమించాడు. కాగా కొద్దిరోజుల నుండి ఆయువతికి తనకు మధ్య కొన్ని అభిప్రాయబేధాల వల్ల ఇద్దరు విడిపోయారు.

ఇక గత వారంరోజుల నుండి మానసికంగా విపరీతమైన ఆలోచనల తో మనసు పాడుచేసుకున్న కిరణ్ తన ఉద్యోగానికి కూడా హాజరవడంలేదని, నిన్నటి నుండి రూమ్ లోనుండి బయటకు రాలేదని, ఎలా ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో చూద్దామని అతని గదికి వెళ్లి తలుపుకొట్టిన సహచరులు, ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు గట్టిగా బద్దలు కొట్టడంతో, అతడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. అంతే ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైన సహచరులు, వెంటనే విషయాన్నీ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని సెల్ ఫోన్ పరీక్షించగా, తాను ప్రేమించిన యువతికి ఐ లవ్ యు అంటూ చివరి మెసేజి చేసినట్లు చెప్తున్నారు. తెలుస్తున్న దాని ప్రకారం అతడు ప్రేమ విఫలం అవ్వడం వల్లనే చనిపోయాడని, అసలు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కిరణ్ మృతదేహాన్ని పోస్ట్ మారటం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు….

  •  
  •  
  •  
  •  

Comments