కలకలం రేపుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు!

Wednesday, April 25th, 2018, 03:55:05 AM IST

బిజెపి ఏపీ నేత సోము వీర్రాజు నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రతుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్రం నిధులు ఒక్కొక్కటిగా ఇస్తుంటే టిడిపి ప్రభుత్వం లబ్ది పొంది కూడా అబద్దం ఆడడం సరైనది కాదని ఆయన అన్నారు. అంతే కాదు ఇలాంటి కుట్రపూరిత వ్యాఖ్యలు మరొక సారి చేస్తే 2004లో జరిగిన సంఘటనే మళ్లి రిపీట్ అవుతుంది అని హెచ్చరించారు. అయితే నేడు ఆయన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణ మూర్తి తీవ్రంగా మండిపడ్డారు. నేడు కర్నూల్ జిల్లా టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సోము వీర్రాజు ఈ విధంగా బెదిరింపులకు దిగడం సరికాదని, 2004 లో అలిపిరి ఘటనే మళ్ళి రిపీట్ అవుతుంది అంటే మమ్మల్ని నిజం అడిగితే మాట్లాడనివ్వరా, చంపేస్తారా అంటూ దుయ్యపట్టారు. ఏపీ కి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని,

అయినా ముందు ఏపీకి కొన్నేళ్లపాటు హోదా ఇస్తామన్న ఎన్డీయే ప్రభుత్వం మల్లి మాటమార్చడం తప్పుడు చర్యగా అభివర్ణించారు. అంతే కాదు చంద్రబాబును, టిడిపి ని అణగదొక్కేందుకు బిజెపి పార్టీ నేతలు జగన్,పవన్ లతో రహస్య ఎజండా నడుపుతున్నారని, అందుకే పవన్ చంద్రబాబు దీక్ష చేసే రోజే ప్రజలదృష్టి దీక్షనుండి మరల్చడానికి ఆరోజు నన రచ్చ చేశారని అన్నారు. మరోవైపు జగన్ కేసు ల నుండి బయటపడటానికి మోడీ ని ఆశ్రయించారని, వారి రహస్య ఎజండా ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎంతమంది మోడీలు, జగన్ లు, పవన్ లు, వచ్చినప్పటికీ చంద్రబాబును ఏమి చేయలేరని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments