ఇలా బెదిరించమని అమిత్ షా చెప్పాడా ఏంటి!

Tuesday, October 2nd, 2018, 10:00:20 AM IST

కేంద్ర సాహెబు బీజేపీ నేతలు ఇప్పటికే దేశంలో పలు చోట్ల బాహాటంగానే ప్రగల్బాలు చెప్పుకున్న సందర్భాలు కోకొల్లలు. వాళ్ళను చూసుకుని రాష్ట్ర స్థాయి కమల నేతలు కూడ అదే తరహాలో చంకలు గుద్దుకుంటున్నారు. ఒక్కొక్కసారి అవి బెదిరింపులుగా కూడ కనిపిస్తున్నాయి.

తాజాగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలో అమిత్ షా ఏం నూరిపోశారో కానీ బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించి, 2014 ఎన్నికలో గెలవడానికి తామే సహాయపడ్డామని చెప్పి ఆఖరున రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నడవాలన్న బీజేపీ సహకారం ఉండాల్సిందే అంటూ బెదిరింపు వాఖ్యాన్ని వదిలారు.

దీన్నిబట్టి రాష్ట్రానికి మంచి జరగాలంటే రాష్ట్ర ప్రజానీకం బీజేపీ ప్రభుత్వానికి చచ్చినట్టు ఓట్లు వేయాల్సిందే అనే అభిప్రాయంలో బీజేపీ నేతలు ఉన్నట్టున్నారు కానీ మద్దతు, వ్యతిరేకతలను పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వ హోదాలో పద్దతి ప్రకారం అన్ని రాష్ట్రాలకు చేయాల్సిన సాయం చేయాల్సిందే అనే ప్రథమ ధర్మాన్ని విస్మరించినట్టున్నారు. అయినా హోదా పేరుతో దగా చేసిన తమను ఏపీ ప్రజలు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆరించబోరన్న వాస్తవాన్ని కమలనాథులు ఎప్పుడు తెలుసుకుంటారో.