తల్లిని బ్రతికించాలని 7 నెలలుగా తాంత్రిక పూజలు!

Sunday, September 9th, 2018, 06:54:00 PM IST

మూఢ నమ్మకం ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకువెళుతోందో గతంలో అనేక దారుణాలు షాక్ కి గురి చేశాయి. ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఘటన కూడా అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మనిషి ఒక సారి మరణించిన తరువాత బ్రతకడం అనేది అసంభవమని తెలిసినప్పటికీ కొందరు తాంత్రిక పూజల పేరుతో అవివేకాన్ని నింపుకుంటున్నారు. ఇటీవల ఒక యువకుడు మరణించిన తన తల్లి కోసం తాంత్రిక పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. అదికూడా విరామం లేకుండా ఏడు నెలల వరకు రోజు తాంత్రిక పూజలు నిర్వహించడం గమనార్హం.

ఛత్తీస్ గఢ్ విశ్వంపూర్ ప్రాంతానికి చెందిన శోభ్ నాథ్ గోండ్, కాళేశ్వరి భార్యాభర్తలు. అరికన్ సింగ్ వారి కుమారుడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో కాళేశ్వరి తీవ్ర అనారోగ్యంతో మరణించింది. దీంతో కుమారుడు తల్లిని బ్రతికించాలని తాంత్రిక పూజలు మొదలు పెట్టాడు. నాతో అమ్మ మాట్లాడుతోంది అంటూ తండ్రిని ఒప్పించి మరి గత కొన్ని నెలల నుంచి నిరంతరంగా తాంత్రిక పూజలు చేస్తూ వచ్చాడు. అయితే రీసెంట్ గా వారికి సంబందించిన బంధువు ఒకతను వారి ఇంటికి రాగా విషయం తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. తల్లి తనతో మాట్లాడుతోందని కుమారుడు విచారణలో తెలిపినట్లు పోలిసులు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments