షాకింగ్ వీడియో : నడవలేని తల్లిని బిల్డింగ్ పై నుంచి తోసేశాడు

Friday, January 5th, 2018, 05:16:49 PM IST

ప్రస్తుత రోజుల్లో మానవత్వం మాయమవుతోందని రోజుకో ఘటన నిరూపిస్తోంది. కన్న తల్లి దండ్రులు అని కూడా చూడకుండా కొందరు వారిపై చూపిస్తోన్న ఆవేశాన్ని చూస్తుంటే నిజంగా మనిషి మెదడు ఏ రేంజ్ లో పనిచేస్తుందో చెప్పవచ్చు. రీసెంట్ గా గుజరాత్ లో ఒక ఉన్నతమైన వ్యక్తి కన్న తల్లినే సీక్రెట్ గా కడతేర్చాడు. తీరా ఘటన విషయం బయటపడటం తో షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాజ్ కోట్ ప్రాంతానికి చెందిన సందీప్ అనే వ్యక్తి మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో అతని తల్లి జయశ్రీ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సరిగ్గా నడవేలిని పరిస్థితి. అయితే ఆమె కూతురే తల్లిని చూసుకునేది. అయితే రోజు సందీప్ కి అతని తల్లి ఆరోగ్యం వల్ల వల్ల భార్యతో గొడవలు వచ్చేవి. దీంతో కన్న తల్లిని చంపాలని ప్లాన్ వేశాడు. నడవలేని ఆ తల్లిని మేడపైకి లాక్కెళ్లి కిందకు తోసేశాడు. ఆ తరువాత ఏమి తెలియనట్టు రూమ్ లోకి వచ్చేశాడు. అయితే స్థానికంగా ఉండే కొందరు మీ అమ్మ కింద పడిపోయింది అని చెప్పడంతో పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానం వచ్చి సిసి టివి ఫుటేజ్ ని పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.