సోనమ్, ఆనంద్ మెహందీ సెలబ్రేషన్స్…

Tuesday, May 8th, 2018, 02:12:53 PM IST

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌, వ్యాపార వేత్త ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో ఉన్న జుహూ నివాసంలో ఉదయం 11 గంటల నుంచి 12:30 వ‌ర‌కు వివాహం జ‌రుగనుంద‌ని తెలుస్తుంది. ప్ర‌ముఖ బాలీవుడ్ సెల‌బ్రిటీలు అంద‌రు పెళ్లి వేడుక‌కి హాజ‌రు కానున్నారు. హిందూ సంప్రదాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నున్న ఈ పెళ్ళికి ప్ర‌తి ఒక్కరు సంప్ర‌దాయ దుస్తుల‌లోనే రానున్నార‌ని అంటున్నారు. ఆదివారం రాత్రి సోన‌మ్ ఇంట జ‌రిగిన మెహందీ వేడుక‌లో తార‌లు త‌ళుక్కుమన్నారు. ఇక నిన్న సాయంత్రం జ‌రిగిన‌ సంగీత్ వేడుక‌లో కత్రినా కైఫ్‌, జాన్వీ, ఖుషీ, రేఖ‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త‌దిత‌రులు మెరిసారు. అంద‌రు ప‌లు బాలీవుడ్ మూవీలోని సాంగ్స్‌కి స్టెప్పులేశారు. ప్ర‌స్తుతం సోన‌మ్‌-ఆహుజాల సంగీత్‌, మెహందీ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లి త‌ర్వాత సోన‌మ్ త‌న తాజా చిత్రం వీరే ది వెడ్డింగ్ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాల‌లో పాల్గొన‌నుంది . ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుంది. మ‌రోవైపు సంజూ చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్న సోన‌మ్ మే 14, 15 తేదీల‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్‌పై న‌డ‌వ‌నున్న సంగ‌తి తెలిసిందే.