పార్టీని జనాలు మర్చిపోకుండా చూడండి.. సోనియా గాంధీ సలహా?

Monday, April 30th, 2018, 08:25:31 AM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో నాయకుల మధ్య పోరు ఏ విధంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఎలక్షన్ల కోసం ముందుగానే నాయకులు ఎవరి స్టైల్ లో వారు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ – వైసీపి పార్టీల మధ్య మాటల తూటాలు తార స్థాయికి చేరుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన కూడా తనదైన శైలిలో ప్రజల మద్దతు ఆందుకుంటోంది. ఇక మధ్యలో ఎన్ని పార్టీలు వచ్చినా చితికిపోవాల్సిందే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిపుడే కాంగ్రెస్ తన రాజకీయ బలాన్ని బలపర్చుకోవడానికి కొత్త ఆలోచనలను అమలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే గత కొంత కాలంగా కాంగ్రెస్ నాయకులు ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో అంత పెద్దగా జనాల్లోకి రావడం లేదు.

ముఖ్యంగా ఆ మధ్య నంద్యాల ఎలక్షన్స్ ను ఓ అభ్యర్థిని పోటీలో నిలిపినా ప్రచారంలో మాత్రం అంత ప్రభావం లేదు. రిజల్ట్ లో కూడా పెద్దగా లాభం లేకపోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం నుంచి సోనియా గాంధీ సీనియర్ నాయకులు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారట. ఓడిపోయినా సరే పరవాలేదు పార్టీని మాత్రం జనాలు మర్చిపోయేలా చేయవద్దని క్లాస్ పీకారట. ఇక రాహుల్ కూడా తనదైన శైలిలో కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ఓటర్లు కాంగ్రెస్ పై నెగిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వచ్చే ఎలక్షన్స్ ను బట్టి పార్టీ తర్వాత ఎలా ముందుకు తీసుకెళ్ళలో ఆలోచిస్తారట. అయితే ఎలక్షన్స్ లో మాత్రం వెనక్కి తగ్గకుండా టీడీపీ కి వైసిపికి వీలైనంత వరకు పోటీని ఇవ్వడానికి ప్రయత్నాలు చెయ్యాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారట. చూడాలి మరి కాంగ్రెస్ ఏ స్థాయిలో పోటీని ఇస్తుందో..

  •  
  •  
  •  
  •  

Comments