మోడీ తెలివైన మాటకారి.. కానీ: సోనియా గాంధీ

Tuesday, May 8th, 2018, 08:41:34 PM IST


కర్ణాటకలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ ఈ సారి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. అందుకోసం కాంగ్రెస్ ముఖ్య అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాన్ని జోరుగా సాగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సోనియా గాంధీ కూడా కర్ణాటక ఎలక్షన్స్ పై ద్రుష్టి సాధించారు. చాలా కాలం తరువాత ఆమె బయటకు రావడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్తేజం ఏర్పడింది.

ఎన్నికల కోసం బెంగుళూరులో నిర్వహించిన ప్రచారంలో జనం భారీగా తరలి వచ్చారు. ఈ ప్రచారంలో సోనియా గాంధీ బీజేపీపై అలాగే మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోనియా గాంధీ మాట్లాడుతు.. ఈ నెల 12న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా ఓటమిని చూస్తుంది. ఎందుకంటే కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు మళ్లీ విజయాన్ని అందించబోతున్నారు. మాట్లాడడంలో మోడీ చాలా తెలివైన వారు. కాని ఆయన మాటలు కడుపు నింపవు. ఆరోగ్యాన్ని కాపాడలేవు. ఆకలి తీరాలంటే అన్నం పప్పు తప్పనిసరి హెల్త్ బావుండాలంటే హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉండాలి. ఇక్కడ సీఎం సీతారామయ్య ప్రజలకు అన్ని అందేలా చేస్తున్నారని మోడీ మాటలను నమ్మవద్దని ఆమె ప్రజలకు తెలియ జేశారు.

  •  
  •  
  •  
  •  

Comments