రాహుల్ ని ప్రధాని చెయ్యాలనే సోనియా కళ ?

Thursday, September 28th, 2017, 03:50:03 AM IST

గత ఎన్నికల్లో ఓటర్లు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో భారీ మార్పులను తీసుకు వచ్చిందనే చెప్పాలి. ఒక్కసారిగా అధికారంలోకి బీజేపీ వచ్చి అందరిని ఆకట్టుకుంటోంది. మోడీ ఆలోచన తీరుకు మరో సారి ఆయన ప్రధాని అయ్యేలా ఉన్నారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్నో ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుతం చిన్న ఎలక్షన్స్ లో డిపాజిట్స్ ను కూడా రాబట్టలేకపోతోంది.

అయితే ఇదంతా పార్టీ ప్రణాళిక లోపమని అందరు అనుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం బలంగా లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ మధ్య టెన్షన్స్ కి చాలా గురవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎలక్షన్స్ కి ఎలాగైనా బిజెపిపై పై పట్టు సాధించాలని ఎప్పటి నుండే ప్రణాలికలు సిద్ద చేసుకుంటున్నారు. అయితే సోనియా గాంధీ ఆ మధ్య ఆనరోగ్యంతో కొంచెం విదేశాలకు వెళ్లి చికిత్స చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు కాస్త వర్క్ ప్రెజర్ ఎక్కువయ్యే సరికి గోవా కి వెళ్ళరాట . ఇంకా ఎలక్షన్స్ వివాదాలు మొదలైతే సిద్ధంగా ఉండాలి కాబట్టి సోనియా ముందుగానే విశ్రాంతి తీసుకుంటుందట. గత కొంత కాలంగా పార్టీ బాధ్యతలను రాహుల్ కి అప్పగిద్దాం అనుకుంటే.. రాహుల్ చిన్న పిల్లాడివలె ప్రసంగాలను ఇస్తున్నాడని. ఇక ప్రధాని అవ్వాలని కూడా తన కొరికని చెప్పుకున్నాడు. అయినా సరే సోనియా – రాహుల్ ని తన కూర్చులోకి రప్పించాలని చూస్తోంది. కానీ కార్యకర్తలు ఒప్పుకోవడం లేదు. ఇక గోవా వెల్లి వచ్చిన తర్వాత రాహుల్ పై ఒక నిర్ణయానికి వస్తున్నట్లు వార్తలు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments