త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల – నాగిరెడ్డి

Tuesday, April 16th, 2019, 01:00:52 AM IST

ఇటీవల తెలంగాణాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో సీఎం కెసిఆర్ స్థానిక ఎన్నికలు త్వరలోనే జరిపేందుకు ఆమోదం తెలిపిన సంగతి విదితమే. కాగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు ఈ నెల 18- 20 తేదీల మధ్య నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలు కూడా 3 దశల్లో జరుగుతాయని నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబందించిన వివరాలను అధికారులకు తెలియజేసినట్లు నాగిరెడ్డి తెలిపారు.

అయితే ఈ నెల 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి, ఓటరు జాబితాతో పాటు పోలింగ్ బూత్‌, అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత బ్యాలెట్ పేపర్లపై సంబంధిత సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికలకు సంబందించిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల ఎంపిక పూర్తయిందని, 20 న ఎన్నికలకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తీ చేస్తామని నాగిరెడ్డి తెలిపారు. 32 జడ్పీ, 535 ఎంపీపీ, 535 జడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.