అతన్ని వెంటనే టీమ్ లోకి తీసుకోవాలి..గంగులీ హాట్ కామెంట్స్

Monday, October 23rd, 2017, 03:48:50 PM IST

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను గెలిచి టీ20 సిరీస్ ని డ్రాగా ముగించుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను ఓటమితో స్టార్ట్ చేసింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ తొలి వన్డేలోనే తడబడింది. బ్యాటింగ్ లో రానించినా బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. అయితే ఈ ఓటమిపై చాలా వరకు విమర్శలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా టీమ్ సెలక్షన్స్ పై సీనియర్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సౌరవ్ గంగులి టీమ్ బ్యాటింగ్ లైనప్ సరిగ్గా లేదని మండిపడ్డారు. రాహల్ లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడిని పక్కనపెట్టడం చాలా దారుణమని చెప్పిన దాదా అతను జట్టుకు చాలా అవసరమని తెలిపారు. అదే విధంగా గత కొంత కాలంగా రాహుల్ ని పక్కనపెడుతుండడం సరైనది కాదని తెలుపుతూ.. వెంటనే అతన్ని జట్టులోకి తీసుకోవాలని చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments