కొత్త పాత్ర లోకి గంగూలీ

Sunday, August 25th, 2013, 07:24:05 PM IST

GANGOLI

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘కోల్‌కతా ప్రిన్స్’ సౌరవ్ గంగూలీ కొత్త అవతారం ఎత్తాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) కోచింగ్ కమిటీ చైర్మన్‌గా అతను బాధ్యతలు స్వీకరించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంగూలీ కొంతకాలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడిన విషయం తెలిసిందే.
క్రికెట్ కామెంటేటర్‌గా, ఎనలిస్టుగా తీరికలేకుండా ఉన్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐదుగురు సభ్యులతో కూడిన సిఎబి కోచింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే, ప్రస్తుతం క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ అవసరం లేదని, ఒకవేళ దాని అవసరాన్ని గుర్తిస్తే మళ్లీ పునరుద్ధరిస్తామని సిఎబి అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా స్పష్టం చేశాడు. బెంగాల్ క్రికెట్ జట్టుకు గంగూలీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.