ఆ దేశంలో మాజీ క్రికెటర్ గంగూలీకి గన్ గురిపెట్టారు

Friday, December 30th, 2016, 09:18:12 AM IST

ganguly
మాజీ భారత క్రికెట్ కెప్టెన్ గంగూలీకి 1996 సిరీస్ లో చేదు అనుభవం ఎదురైంది. 1996 టెస్ట్ సిరీస్ గంగులీకి తొలి సిరీస్. ఈ సిరీస్ గంగూలీకి మధుర జ్ఞాపకాలనే కాదు, మరికొన్ని చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చింది. ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో ఆనాడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఆ సిరీస్ మధ్యలో గంగూలీకి కొంచెం ఖాళీ దొరకడంతో తన బంధువులను కలవడానికి కావెండిష్ నుండి పిన్నార్ కు లండన్ అండర్ గ్రౌండ్ ట్రైన్ లో ప్రయాణించదు. అతనితో పాటు మరొక క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా ఉన్నాడు.

వీరు కూర్చున్న క్యారేజ్ లో టీనేజర్లు అయిన ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ యువకులలో ఒక యువకుడు బీర్ తాగి ఖాళీ క్యాన్ ను వీళ్ళ మీద పడేసాడు. గంగూలీ అదేం పట్టించుకోకుండా క్యాన్ పక్కకు గెంటి సిద్ధుని కూడా వారించాడు. అయినా కూడా ఆ యువకుడు మాటలతో దాడి చేస్తూ వీరిపైకి దూసుకొచ్చాడు. సౌరవ్ కొంచెం సంయమనం పాటించినా సిద్దు మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో గొడవ పెద్దది అయ్యింది. ఇంక గంగూలీ కూడా ఏదైతే అది అవుతుందని తాను కూడా సిద్ధుకి జత కలిసాడు. ఆ తోపులాటలో ఆ యువకుడు కింద పడిపోయాడు. దీంతో ఆ యువకుడు పైకి లేచి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి గంగూలీ ముఖంపై గురిపెట్టాడు. అంతే గంగూలీ ‘ఇంక తన జీవితం ఈ ట్రైన్ లోనే ముగిసిపోయింది’ అనుకున్నాడు. అయితే ఆ యువకుడి స్నేహితురాలైన ఒక అమ్మాయి ఆ యువకుడిని అక్కడి నుండి లాక్కుని పోవడంతో బ్రతుకు జీవుడా అనుకుని సిద్దు, గంగూలీ అక్కడి నుండి బయటపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments