పెప్సీ, కోకోకోలా లను బ్యాన్ చేశారు…!

Wednesday, January 25th, 2017, 02:09:37 AM IST

cocola
మన భారతీయ సినిమా నటులు సాఫ్ట్ డ్రింక్స్ కు సంబంధించిన యాడ్ ఫిలిమ్స్ చాలానే చేశారు. వారు నటించారన్న కారణంతో మన ప్రేక్షకులు కూడా తమ అభిమాన తారలు నటించిన యాడ్స్ చూసి అవే తాగుతూ ఉంటారు. ఎక్కువగా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు విరామ సమయంలో ఖచ్చితంగా ఏదొక శీతల పానీయాన్ని తాగుతారు. కానీ ఇప్పుడు తమిళనాడు జల్లికట్టు ఉద్యమ నేపథ్యం వీటి అమ్మకాలపై పడింది.

తమిళనాడు ఉద్యమ నేపథ్యంలో విదేశీ పానీయాలను నిషేదించాలని తమిళనాడు సినిమా థియేటర్ల యజమానుల సంఘం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ మధురై, విరుదునగర్, రామనాథపురం ప్రాంతాల్లోనే కాకుండా ఇంకా పలు ప్రాంతాల్లో కొన్ని థియేటర్లలో పెప్సీ, కోకోకోలా కూల్ డ్రింక్ ల అమ్మకాలను నిలిపివేశారు. దీనికి అక్కడ ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది.