మైక్రో సాఫ్ట్ ఇండియా కు అరుదైన గౌరవం!

Thursday, April 26th, 2018, 11:32:27 AM IST

ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఉద్యోగులు ఎటువంటి కంపెనీలలో పనిచేయాలని కోరుకుంటున్నారు, ఆయా కంపెనీల నుండి వారు ఆశించే ప్రాధమిక అంశాలు ఏమిటి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,75,000 తమ తీర్పును తెలిపారు. అందులో ఎక్కువగా మైక్రో సాఫ్ట్ ఇండియా అత్యంత ఆకర్షణీయమైన కంపెనీ అని చెప్పడం ద్వారా ఆ కంపెనీ ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది అని చెప్పాలి. కాగా ఆ తరువాత అమెజాన్ ఇండియా, ఆ తరువాత ర్యాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ సంస్థలు నిలిచాయి. అయితే ప్రస్తుతం తాము కొనసాగుతువ కంపెనీలలో ఇంకా పనిచేయడానికి కారణం ఉద్యోగ భద్రత అని 45శాతం మంది ఉద్యోగులు చెపుతున్నారట.

నిజానికి ఇప్పటి కాలంతో పోలిస్తే ఒకప్పుడు కంపెనీ బ్రాండింగ్ కి పెద్ద ప్రాముఖ్యత ఉండేది కాదని, కానీ ప్రస్తుతం మాత్రం కంపెనీ బ్రాండింగ్, ప్రొఫైల్, రోల్ తెలుసుకున్నాకే చేరుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఉద్యోగి వేతనం, ఉద్యోగులకు ఆ కంపెనీ ఇచ్చే ప్రాముఖ్యత, లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిచేయటం వంటివి కూడా ఉద్యోగ నియామకాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయట. అలానే అత్యంత ఆకర్షణ గల మూడు అగ్రగామి రంగాల్లో ఐటి, ఐటి ఈఎస్ 69శాతం, ఆటోమోటివ్ 68శాతం, రిటైల్ ఎఫ్ఎమ్సిజి 67శాతం గా వున్నాయట.

అలానే వృత్తి జీవితంలో ఎదగడానికి అవకాశాలిచ్చే సంస్థలు, కంపెనీలు 43శాతం అధికంగా ఆకర్షిస్తున్నాయని సంస్థలను వీడిన ఉద్యోగులు అంటున్నారు. రంగలవారీగా చూస్తే టిసిఎస్, ఎల్ఎండ్ టి, హిందుస్థాన్ యూనీలీవర్ ముందువరసలో ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే మొత్తంగా చూస్తే హిందుస్థాన్‌ యునిలీవర్‌, ఐబీఎమ్‌ ఇండియా, ఐటీసీ గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టీ, మెర్సిడెజ్‌ బెంజ్‌, శాంసంగ్‌ ఇండియా, సోనీ ఇండియా, టీసీఎస్‌లు తొలి 10 స్థానాల్లో ఉన్నాయి అని ఈ సర్వే ఫలితాలు చెపుతున్నాయి….

  •  
  •  
  •  
  •  

Comments