వైజాగ్ లో పోలీసులకు ఝలక్ ఇచ్చిన తెలుగు యువత

Thursday, January 26th, 2017, 02:35:40 PM IST

police-vizag
కొద్దిరోజుల నుండి వైజాగ్ ఆర్కే బీచ్ లో తెలుగు యువత నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తెలుగు సినీ నటులు, ప్రతిపక్ష నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా చేసే నిరసనలకు అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. ఎవరైనా అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తే అడ్డుకుంటామని పోలీసులు చెప్పారు.

ఈ రోజు నిరసన కార్యక్రమాలను చేయడానికి పెద్ద ఎత్తున యువత వైజాగ్ చేరుకున్నారు. వైజాగ్ లో భారీగా మోహరించిన పోలీసులు ఎవరినీ బీచ్ వైపు వెళ్లనీయడం లేదు. రోజూ వాకింగ్ చేసుకునే వాళ్ళను కూడా ఈ రోజు పోలీసులు బీచ్ లోకి అనుమతించడం లేదు. దీంతో అక్కడ తలపెట్టిన నిరసన కార్యక్రమం జరుగుతుందో లేదో అనే పరిస్థితి నెలకొంది. అయితే పోలిసుల వ్యవహార శైలితో యువత రూటు మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్కే బీచ్ లో పోలీసులు ఉండడంతో నిరసన కార్యక్రమాన్ని ఉడా పార్క్ కు మార్చినట్లు హోదాకు మద్దతు ఇచ్చిన పేస్ బుక్ పేజీలలో, ట్విట్టర్ ఖాతాల్లో పోస్టింగ్స్ వస్తున్నాయి. యువత అందరూ అక్కడకి రావాలని పిలుపునిస్తున్నారు. హీరో సంపూర్ణేష్ బాబు కూడా ఇదే విషయాన్ని పవన్ ఫ్యాన్ పేరుతొ ఉన్న ఒక ట్వీట్ ను రీట్వీట్ చేసాడు.