ఆంధ్రకు హోదా ఇచ్చితీరాల్సిందే : కేజ్రీవాల్

Sunday, April 8th, 2018, 05:17:15 PM IST

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై ప్రస్తుతం రాష్ట్రం లో నిరసనలు రోజు రోజుకూ ఉధృతమవుతున్నాయి. అయితే అందులో భాగంగా నిన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అలానే మరోవైపు టీడీపీ ఎంపీ లు కూడా తమ నిరసనను ఢిల్లీ లో తీవ్రతరం చేశారు. ఇప్పటికే పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టిన టీడీపీ ఎంపీలు ఇవాళ ఢిల్లీ లోని ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడికి యత్నించారు. ఐతే అప్పటికే పోలిస్ లు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

అయితే ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆంధ్రకు ప్రత్యేక హోదా విషయమై తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతే కాక విభజన హామీలు కూడా నెరవేర్చాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన టీడీపీ ఎంపిలను ఈ విషంగా అరెస్టులు చేయడం తగదని ఆయన బిజెపి ప్రభుత్వ తీరుని ఖండించారు…..

  •  
  •  
  •  
  •  

Comments