శ్రీ శాంత్ కి బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Tuesday, June 11th, 2013, 11:02:35 AM IST


ఐపిఎల్ 6 లో భాగంగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శ్రీ శాంత్ కి ఎట్టకేలకు మోకా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీ శాంత్ తో పాటు ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కొని ఉన్న మరో 18 మందికి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఈ కేసు వివరాలను మోకా కోర్టుకు సమర్పించారు మోకా చట్టం ప్రకారం సరైన ఆధరాలు చూపనందు వల్ల ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిదితులైన వారందరికీ బెయిల్ ను మంజూరు చేసింది.

ఒకసారి సారి ఆధారాలు లేవని బయటకి వచ్చిన తర్వాత సరైన ఆధారాలతో మళ్ళీ స్పాట్ ఫిక్సర్స్ నేరాలు రుజువవుతాయన్న నమ్మకం పెద్దగా ఉండదు. ఎంతో హడావుడిగా మొదలైన ఈ కేసు ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.