శ్రీ లంకని భారత్ డీ కొట్టేనా.!

Tuesday, July 2nd, 2013, 05:28:50 PM IST

కరేబియన్ దీవుల ఆతిధ్యంగా ప్రస్తుతం ఇండియా – శ్రీ లంక – వెస్ట్ ఇండీస్ మధ్య ముక్కోణపు సీరీస్ జరుగుతోంది. ఈ సీరీస్ లో ఇండియా, శ్రీ లంకలపై చెరో మ్యాచ్ గెలిచి వెస్ట్ ఇండీస్ టీం చాలా హ్యాపీగా ఉంది. మరో వైపు కరేబియన్ దీవుల్లో ఓటమి పాలైన ఇండియా – శ్రీ లంక ఈ రోజు తలపడుతున్నాయి. అలాగే ఎవరికి వారు ఈ మ్యాచ్ గెలవాలని తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మొదటి మ్యాచ్ తర్వాత తొడ కండరాల నొప్పితో ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీరీస్ కి దూరమవ్వడంతో కెప్టెన్ పగ్గాలు విరాట్ కోహ్లీ చేతికి వెళ్ళాయి. అలాగే ధోనీ స్థానంలో అంబటి రాయుడుకి చాన్స్ ఇచ్చారు.

ఇది వరకు జరిగిన మ్యాచ్ ని బట్టి ఇరు జట్లకి ఉన్న బలం బలహీనతలను గురించి చూసుకుంటే టీం ఇండియాలో ఫాంలో ఉన్న రోహిత్ శర్మ అలాగే బ్యాటింగ్ కొనసాగించాలి. ధావన్, కోహ్లీ, రైనా, రాయుడులు ఫాంలోకి వస్తే ఇండియన్ టీం బ్యాటింగ్ కాస్త స్ట్రాంగ్ అవుతుంది. ప్రస్తుతానికి ఫేస్ బౌలర్స్ బాగా ఫాంలో ఉన్నారు, వారికి స్పిన్నర్స్ తమ వంతు సాయం అందిస్తే సరిపోతుంది. శ్రీలంక విషయానికొస్తే బ్యాటింగ్ మొత్తం జయవర్దనే, సంగక్కరల మీదే ఆధారపడాల్సి వస్తోంది, మిగతా టీం బ్యాట్స్ మెన్స్ ఫాంలోకి వస్తే టీంకి చాలా హెల్ప్ అవుతుంది. మలింగ, కులశేఖర, అజంతా మెండిస్ లు వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యారు.

దీని పరంగా చూసుకుంటే కాస్తో కూస్తో ఇండియా టీం బ్యాటింగ్, బౌలింగ్ లో కాస్త బెటర్ గా ఉందని అనిపిస్తోంది. కానీ మనకు కరేబియన్ పిచ్ లు కొత్త కావడం వల్ల చివరికి ఎవరు విజయం సాధిస్తారో అనేది ఉత్కంఠగా మారింది. కోహ్లీ సారధ్యంలో లంక సేనని ఇండియా డీ కొడుతుందో లేదో చూడాలి.