బాంగ్లాదేశ్ పొగరు అనిగింది..లంక ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ !

Monday, March 19th, 2018, 09:23:28 AM IST

బాంగ్లాదేశ్ – ఇండియా – శ్రీలంక ల మధ్య జరిగినా ముక్కోణపు టీ20 టోర్నీ మొత్తం వరల్డ్ కప్ ని తలపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు దేశాల అభిమానులలో ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠను రేపింది. ముఖ్యంగా టోర్నీ చివరలో మూడు దేశాల పొగరు బాగానే కనిపించింది. అయితే బంగ్లా అంతకు మించిన పొగరుతో కనిపించడంతో కుప్పకూలక తప్పలేదు. ఆదివారం బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సిక్స్ కొట్టి భారత్ కి విజయాన్ని అందించిన దినేష్ కార్తీక్ పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే శ్రీలంక అభిమానులు కూడా భారత్ వైపే నిలిచారు.

ఇండియా గెలవగానే ఇండియన్స్ కంటే వారే ఎక్కువగా ఆనందపడటం హాట్ టాపిక్ అయ్యింది. భారత అభిమాని సుధీర్ కుమార్ చౌదరిని లంక అభిమానులు ఎత్తుకొని గ్రౌండ్ చుట్టూ తిరిగారు. అయితే లంక అభిమానులు ఈ స్థాయిలో ఆనందపడటానికి ఓ కారణం ఉంది. మొన్నా బంగ్లా జట్టు లంక తో లీగ్ చివరి మ్యాచ్ ఆడి గెలిచినా సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో బంగ్లా ఆటగాళ్లు మితిమీరిన ఆనందంతో చిందులు వేశారు. పొగరుగా లంక క్రికెటర్లను అవమానించే విధంగా నాగిని డ్యాన్స్ చేశారు. చివరి ఓవర్లలో నానా హంగామా చేశారు. గెలిచినా అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న అద్దాలను సైతం పగులగొట్టారు. ఆ విషయంపై ఐసిసి వివరణ కోరగా బంగ్లా క్రికెట్ బోర్డు క్షమాపణలు చెప్పింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో బంగ్లా జట్టు బాగానే ఆడినా చివరలో దినేష్ కార్తీక్ ధాటికి ఓటమిని చూడక తప్పలేదు.