నాపై వస్తున్న వార్తలన్నీ అబద్దం.. మిరే వ్యభిచారం చేస్తున్నారు: శ్రీ రెడ్డి

Wednesday, July 25th, 2018, 11:26:55 AM IST

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి విమర్శలను షిఫ్ట్ చేసిన శ్రీ రెడ్డిపై గత కొంత కాలంగా వార్తలు ఏ స్థాయిలో వస్తున్నాయో అందరికి తెలిసిందే. సౌత్ లో సోషల్ మీడియాలో అయితే ఘాటైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చెన్నై లో ఆమెపై వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కువగా పోలీస్ కేసు నమోదైనట్లు టాక్ వచ్చింది. ఆమె అవకాశాల కోసం దర్శకుల దగ్గరికి హీరోల దగ్గరికి వెళ్లాను అని చెప్పింది కాబట్టి అది వ్యభిచారం కిందకే వస్తుందని కొందరు చెన్నై లో పోలీస్ కేసు నమోదు చేశారని యూట్యూబ్ ఛానెల్స్ లో ఎక్కువగా వచ్చాయి.

అయితే ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందించారు. వ్యభిచారం కేసులో తనని అరెస్ట్ చేశారని పలు ఛానెల్స్ అలాగే యూ ట్యూబ్ ఛానెల్స్ ప్రచారాలు చేస్తున్నాయి. నేను వ్యభిచారిని కాదు. డబ్బు కోసం ప్రచారాలు చేస్తున్న మీరే వ్యభిచారం చేస్తున్నట్లు ఉందని పలు మీడియా సంస్థలపై ముడిపడ్డారు. ఈ విధంగా అసత్యాలను ప్రచారం చేయడం కరెక్ట్ కాదని మీకన్నా చీడ పురుగులు వ్యభిచారం చేసే అమ్మాయిలు ఎంతో మేలని చెబుతూ.. కొన్ని యూ ట్యూబ్స్ ఛానెల్స్ మరణించాలని తాను కోరుకుంటున్నట్లు శ్రీ రెడ్డి తన ఫెస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments