నాని కామెంట్స్ పై స్పందించిన శ్రీ రెడ్డి

Monday, June 11th, 2018, 11:18:00 PM IST

నాని – శ్రీ రెడ్డిల వివాధం ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ నాని లీగల్ నోటీసులు ఇవ్వడానికి సిద్దమయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నోటీసులు అందాయి. నాని తరపు న్యాయవాధులు కూడా శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ.. వారం రోజుల్లో సిటీ సివిల్ కోర్టులో శ్రీ రెడ్డి తప్పకుండా సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఇక శ్రీ రెడ్డి ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

నాని చట్టపరంగా తీసుకుంటున్న చర్యలకు సిద్ధమని చట్టపరంగా తాను మేము కూడా ఫైట్ చేస్తామని చెప్పారు. అనంతరం నానికి పరోక్షంగా శ్రీ రెడ్డి మరో ట్వీట్ చేశారు. అసలు బిగ్ బాస్ షో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లేకుండా ఎలా చూడాలో అర్ధం కావట్ల, తెలుగు ప్రజలందరూ తారక్ ని చాలా మిస్ అవుతున్నారు.తారక్ చేసినంత బాగా షో ని నడిపించే దమ్ము ఇంకెవరికి లేదు అని శ్రీ రెడ్డి ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments