లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు : శ్రీ రెడ్డి

Tuesday, June 5th, 2018, 02:25:32 PM IST

ఎవరు స్పందించిన స్పందించకపోయినా శ్రీ రెడ్డి మాత్రం తన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కి అస్సలు బ్రేక్ వెయ్యడం లేదు. మెగా ఫ్యామిలీపై తరచు తన వ్యాఖ్యలతో వైరల్ అయ్యేలా చేసుకుంటూనే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆమె స్పెషల్ గా టార్గెట్ చేయడం గత కొంత కాలంగా వస్తున్నదే. అయితే ఎవరు ఊహించని విధంగా ఆమె ఈ సారి లోకేష్ బాబుపై కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

“నారా లోకేశ్‌ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అంటూ పరోక్షంగా పవన్ మాటలపై స్పందించింది. ‘‘మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికై, అక్కడ పైసా అభివృద్ధి చేయలేదని ప్రజలందరికీ తెలుసు. ఓర్పుగా ఉండటం సినిమా డైలాగ్స్‌ కొట్టి నీళ్లు తాగినంత సులువు కాదు. మీ అన్న రాజకీయాలు, సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలియదు?’’ అని శ్రీరెడ్డి ఫెస్ బుక్ లో పేర్కొన్నారు. అలాగే బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. ఆ షోపై మెగా ఫ్యామిలీ ప్రభావ ఉందని హోస్ట్ నానికి తనకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని శ్రీ రెడ్డి పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments