వీడియో : నానిపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Friday, June 8th, 2018, 07:18:10 PM IST

క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలువురు ప్రముఖ నటీనటులపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ 2 స్టార్ట్ చేయనున్న హీరో నానిపై ఆమె విరుచుకుపడటం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడు లేని విధంగా ఆమె నాని పై ఒక వీడియో పోస్ట్ చేసింది. తనకు నానికి జరిగిన లవ్ స్టార్ అంటూనే.. మరో ఘాటు వ్యాఖ్య చేస్తూ ఆ విషయాన్ని బయటపెడుతున్నట్లు చెప్పారు.

నాని + శ్రీ = డర్టీ పిక్చర్ అంటూ మొదలు పెట్టిన ఆమె.. మా ఇద్దరి మధ్య జరిగిన స్టోరీని తప్పకుండా బయటపెడతాను. ఎప్పుడైతే మాకు వచ్చిన ఆఫర్స్ ను కూడా తొక్కేస్తున్నావో నీ విషయాలు కూడా బయట తెలియాలి కదా అని చెబుతూ.. నాని చేసిన కార్యక్రమాలను అన్నిటిని తాను బయటపెడతాను అన్నట్లు శ్రీ రెడ్డి వీడియోలో చెప్పింది. బిగ్ బాస్ లో తనకు అవకాశం పోవడానికి నానియే కారణమని అందుకు ఇలా చేస్తున్నట్లు ఆమె మాటలను బట్టి అర్ధమవుతోంది. ఇక నెటిజన్స్ మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయంతో కామెంట్ చేస్తున్నారు.