బ్రేకింగ్ న్యూస్ : నాగ బాబుపై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు…

Sunday, April 22nd, 2018, 06:04:17 PM IST

గత కొద్దికాలంగా సంచలన నటి శ్రీ రెడ్డి పవన్ పై చేసిన్బ అనుచిత వ్యాఖ్యల గురించి తెలిసిందే, అయితే తాజాగా నటి శ్రీరెడ్డి మరో ఆక్రుత్యానికి తెరలేపింది. పవన్ పై చేసిన దురుసు మాటల వల్ల తనకు అపాయం పొంచి ఉందని జరిగిన ఘటన తరువాత అమయ సందర్భం లేకుండా తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయంటూ ఆరోపించింది. ముఖ్యంగా మెగాహీరో నాగబాబు తనకు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతన్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆమె భయాందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్నాయి. నాకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం అంటూ ట్విట్టర్‌లో శ్రీరెడ్డి పేర్కొన్నారు.