శ్రీ రెడ్డి లీక్స్ : ప్రముఖ తమిళ దర్శకుడిపై షాకింగ్ కామెంట్స్!

Wednesday, July 11th, 2018, 11:06:09 PM IST

ఇటీవల టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయమై అవకాశాల కోసం వస్తున్న తెలుగు అమ్మాయిలను కో ఆర్డినేటర్లు వారిని లైంగికంగా వేధిస్తున్నారని సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించిన శ్రీ రెడ్డి, ఆ తరువాత సినీ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరాం, అలానే పలువురు ఇతర సినిమా ప్రముఖులతో తన సంబంధాల విషయమై మాట్లాడి పెను సంచలనమే రేపింది. కాగా ప్రస్తుతం ఆమె ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ విషయమై సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేసింది. హలో మురుగదాస్ గారు మీకు గ్రీన్ పార్క్ హోటల్ విషయం గుర్తుందా, అంటూ మొదలెట్టారు. మనం అప్పట్లో రచయిత వెలిగొండ శ్రీనివాస్ ద్వారా కలిసాం, మీరు నాకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు కదా అంటూ చెప్పుకొచ్చింది.

మీ నుండి పిలుపు కోసం ఛానళ్ల నుండి ఎదురు చూసాను, కానీ మీ నుండి నాకు ఎటువంటి అవకాశం రాలేదు, నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తి సర్ అంటూ సంచలన ఆరోపణలు చేసి అందరిని షాక్ లో పడేసింది. కాగా ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె వ్యాఖ్యలు నిజమే అయివుండొచ్చు అని అంటుంటే, మరి కొందరేమో ఆమె పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా మురుగదాస్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తోంది అని మండిపడుతున్నారు. కాగా ఆమె చేసి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాగా ఆమె చేసిన ఆరోపణలపై దర్శకుడు మురుగదాస్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి….

  •  
  •  
  •  
  •  

Comments