వివాదంలో వర్మ ‘శ్రీదేవి’

Saturday, October 11th, 2014, 02:44:13 AM IST

sridevi-rgv
సంచలన వివాదాలకు కేంద్ర బిందువైన వర్మ.. తన తాజా సినిమా టైటిల్ పై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఒక చిన్న పిల్లవాడు చీర కట్టుకున్న ఒక అమ్మాయి నాభిని చూస్తునట్టు ఉన్న పోస్టర్ ను వర్మ ఇటీవలే విడుదల చేశారు. అంతేకాకుండా తన తాజా సినిమాపేరు సావిత్రి అని కూడా ప్రకటించి.. వివాదంలో చిక్కుకున్నారు. సావిత్రి అనే పేరు ఎంతో పవిత్రమైనదని.. భారతీయ సాంప్రదాయంలో ఆ పేరుకు ఒక గుర్తింపు ఉన్నది.. కాబట్టి వెంటనే ఆ పేరును తొలగించాలని మహిళా సంఘాలు ఆందోళన చేయడంతో.. వర్మ సినిమా పేరు సావిత్రి కాదు శ్రీదేవి అని ప్రకటించారు.

అయితే, ఇప్పుడు ఈ పేరుకూడా.. వివాదంగా మారింది. ఎవర్ గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి..తన పేరును వాడుకోవడంపై వర్మకు నోటీసులు పంపింది. ఈ నోటీసులపై మూడు రోజులలోగా సమాధానం ఇవ్వాలని..శ్రీదేవి తరుపు న్యాయవాది పేర్కొన్నారు. మూడు రోజులలోగా సమాధానం ఇవ్వకుంటే.. తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై వర్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.