అతిలోక సుందరికి జన్మదిన శుభాకాంక్షలు

Tuesday, August 13th, 2013, 10:42:55 AM IST

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి అందరి మనసులను ఆకట్టుకున్న అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు ఈరోజు. తమిళనాడులో పుట్టిన ఆమె ఈ రోజు 50 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఎన్నో సినిమాల్లో నటించిన బోని కపూరు ను వివాహం చేసుకొన్న తరువాత సినిమాలకు దూరం అయ్యింది. ఈ మద్యనే ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ సినిమాతో తిరిగి సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. 1975లో జూలీ సినిమాతో బాల నటిగా మనకు పరిచయం అయిన శ్రీదేవి ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా చిరంజీవి, నాగార్జునతో కూడా పలు సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు పొందింది.

దక్షణాది నుండి వెళ్లి బాలీవుడ్ ను ఏలిన హీరోయిన్స్ లో శ్రీదేవి కూడా ఒకరు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు జాన్వి, ఖుషి. తను వారితో కలిసి చాలా కార్యక్రమాలలో పాలోంది. ఐదు పదుల వయసులో వోక్ పత్రికకు పోజులిచ్చి దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల మనసులు కొల్లగొట్టిన తార శ్రీదేవి. ఈ వయసులో కూడా వన్నెతరగని ఆమె అందంతో, అద్బుతమైన నటనతో అందరి మనసులను దోచుకుంటున్న శ్రీదేవికి netiap.com తరుపున జన్మదిన శుభాకాంక్షలు.