ఊహ‌కే అంద‌ని షాక్‌ : అతిలోక సుంద‌రి అస్త‌మ‌యం

Sunday, February 25th, 2018, 09:04:01 AM IST

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటానుకోట్ల మంది అభిమానులను షాక్‌కు గురి చేస్తూ.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి (54) శ‌నివారం రాత్రి ఆక‌స్మిక మృతి చెందారు. దుబాయ్‌లో త‌న బంధువు మోహిత్‌ మార్వా వివాహ వేడుక‌కు హాజ‌రైన శ్రీదేవి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఊహించ‌ని ఈ షాకింగ్ న్యూస్‌తో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

54 వ‌య‌సులోనే శ్రీ‌దేవి ఉన్న‌ట్టుండి ఇహ‌లోకం వీడి వెళ్లార‌న్న వార్త అత‌హ‌శుల్ని చేసింది. ఇదంతా.. ఉత్త‌రాది మీడియా య‌థావిధిగా ప్ర‌చురించే పనికిమాలిన గాసిప్ అనే న‌మ్ముతున్నారింకా. గుండెపోటు వ‌చ్చిన స‌మ‌యంలో శ్రీ‌దేవి వెంట భ‌ర్త బోనీక‌పూర్‌, రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ త‌న‌తోనే ఉన్నారు. పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ త‌న డెబ్యూ చిత్రం `ధ‌డక్‌` షూటింగులో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ముంబైలోనే ఉంటోంది. శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త విన్న‌వెంట‌నే పెద్ద ఎత్తున అభిమానులు, సెల‌బ్రిటీలు ముంబైలోని శ్రీ‌దేవి స్వ‌గృహానికి పోటెత్తారు.