నోటి దురదతో నానా తిట్లు తిన్న రాధాకృష్ణ !

Sunday, October 7th, 2018, 11:34:47 AM IST

ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు శ్రీకాకుళం వేడి తెగ తగులుతోంది. మొన్నా మధ్య ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తెలుగుదేశం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుని ఇంటర్వ్యూ చేసిన రాధాక్రిష్ణ భాషా ప్రావీణ్యం గురించి మాట్లాడుతూ శ్రీకాకుళం వాళ్ళకి పొట్టబోధిస్తే అక్షరం ముక్క రాదు కదా మరి మీరు ఇంత బాగా హిందీ ఎలా మాట్లాడుతున్నారు అంటూ అలవాటుగా నోరు జారాడు.

దీంతో శ్రీకాకుళం జనాలకు ఆయనొక శత్రువయ్యారు. భాష పేరుతో మమల్ని అవమానిస్తారా అంటూ సోషల్ మీడియాలో శ్రీకాకుళం యువత ఆర్కేను ఒక ఆటాడేసుకోగా ప్రజాగాయకులు రోడ్డెక్కి మరీ ఆర్కే భాగోతాన్ని పాటలు రూపంలో బయటపెడుతున్నారు. వంగవీటి డ్రైవర్ గా నీ బ్రతుకు తెలుసు మాకు, మంచాలు సర్ది మరీ జర్నలిస్ట్ అయ్యావు, కమ్మనైన మాటలు చెప్పి డబ్బులు గుంజుకున్నావు అంటూ ఎడా పెడా వాయించేశారు.

పొట్ట చింపితే మాకు అక్షరం రాదన్నావు గురజాడ, పురిపండ, చాసో, శ్రీకాకుళంలో గిడుగు వంటి గొప్ప వాళ్ళు మా ప్రాంతం నుండే వచ్చారు. కళ్ళు కావరం ఎక్కి పిచ్చి పిచ్చి మాటలాడకు అంటూ కక్ష తీర్చుకున్నారు. అంతేకాదు ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టి, ఏబీఎన్ ఛానెల్ ఎదుట నిరసనలు సైతం వ్యక్తం చేశారు. మొదటి నుండి కొంచెం నోటి దురద ప్రదర్శించే ఆర్కే గతంలో పలుసార్లు విమర్శలు ఎదుర్కున్నా ఈసారి మాత్రం తీవ్ర స్థాయిలో మాటలు పడాల్సి వచ్చింది.