తితిలీ సాయంలో మెగా యూట‌ర్న్

Sunday, October 21st, 2018, 11:56:50 AM IST

ప్ర‌కృతి వైప‌రీత్యాల వేళ టాలీవుడ్ స్పంద‌న అమోఘం. మెగా ఫ్యామిలీ నుంచి భారీ విరాళాలు అందుతున్న సంగ‌తి చూస్తున్నాం. హుద్ హుద్ తుఫాన్‌, చెన్న‌య్ విల‌యం, కేర‌ళ పెను విధ్వంశం ఇలా సంద‌ర్భం ఏదైనా టాలీవుడ్ కోట్లాదిగా విరాళాలు ప్ర‌క‌టించింది. మ‌న స్టార్ హీరోలంతా ల‌క్ష‌ల్లో విరాళాలు ప్ర‌క‌టించి దాతృత్వం చాటుకున్నారు. మొన్న‌టి కేర‌ళ వ‌ర‌ద‌ల వేళ కోటి విరాళం కేవ‌లం మెగా ఫ్యామిలీ నుంచే అందింది.

ఈసారి సిక్కోలు వంతు. కేర‌ళ‌కు ప్ర‌క‌టించినంత స్పీడ్‌గా సిక్కోలుపై స్పందించ‌క‌పోయినా నెమ్మ‌దిగా ఒక‌రొక‌రుగా త‌మ వంతు సాయం ప్ర‌క‌టిస్తూ వేడి పెంచుతున్నారు. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ 25ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించారు. బాల‌కృష్ణ ఫ్యామిలీ నుంచి బాల‌య్య 25ల‌క్ష‌లు, బాల‌య్య కుమార్తె 60ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ప‌లువురు యువ‌హీరోలు విరాళాలు ప్ర‌క‌టించారు.

అయితే ఈసారి సిక్కోలు విష‌యంలో మెగాఫ్యామిలీ మాత్రం యూట‌ర్న్ తీసుకుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఏ ఉప‌యోగం లేదు. అస‌లు బాధితుల‌కు ఆ విరాళాలు అంద‌డం లేదు. అందుకే ఇక‌పై ఇలాంటి విప‌త్తులు వ‌స్తే గ‌నుక నేరుగా బాధితుల‌కు అందించేలా అభిమానుల్ని, అభిమాన సంఘాల్ని యాక్టివేట్ చేస్తున్నార‌ట‌. ఓవైపు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌న‌సేన‌ల ద్వారా సిక్కోలు బాధితుల్ని ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బ‌న్ని సైతం త‌న అభిమాన సంఘాల ద్వారా శ్రీ‌కాకుళం బాధితుల‌కు సాయం అందించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇత‌ర మెగా హీరోలు ఇదే ప్రాతిప‌దిక‌న సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళాలు ఇవ్వ‌కుండా నేరుగా బాధితుల‌కే అందేలా సాయం చేయాల‌ని అభిల‌షిస్తున్నార‌ట‌. ఓవైపు ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన పార్టీకి మెగా హీరోలు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. ఆ క్ర‌మంలోనే మెగా యువ‌హీరోలు సిక్కోలు బాధితుల్ని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశార‌ట‌. సీఎం రిలీఫ్ ఫండ్ కి చేరిన హుద్ హుద్ విరాళాలు ఎటెళ్లాయో ఎవ‌రికీ తెలీదు. వాస్త‌వ బాధితుల‌కు అంద‌లేద‌న్న విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వెల్లువెత్తాయి. అందుకే ఇప్పుడు నేరుగా బాధితుల్ని ఆదుకునే ప్ర‌య‌త్నం మ‌న టాలీవుడ్ హీరోలు చేస్తున్నార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments