కరేబియన్ దీవుల్లో భారత్ మరో ఓటమి

Wednesday, July 3rd, 2013, 04:08:39 AM IST


ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో వెస్ట్ ఇండీస్ – ఇండియా – శ్రీలంక మధ్య ముక్కోణపు వండే సీరీర్ జరుగుతోంది. ఇప్పటికే విండీస్ చేతిలో పరాజయం చవిచూసిన శ్రీలంక – ఇండియా జట్లు ఈ రోజు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ధోనీ లేకుండా కోహ్లీ సారధ్యంలో గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్స్ ని శ్రీ లంక బాట్స్ మెన్స్ మొదటి నుంచి దీటుగా ఎదుర్కున్నారు. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 1 వికెట్లు నష్టపోయి 348 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా మొదటి నుంచి ఆచి తూచి ఆడినా శ్రీ లంక స్కోర్ ని చేజ్ చేయలేకపోయింది. ఇండియా 44.5 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 187 పరుగులు మాత్రమె చేసి కరేబియన్ దీవుల్లో మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.