శ్రీ‌మ‌తి సావిత్రి గ‌ణేష్ జిల్లాప‌రిష‌త్ హైస్కూల్‌

Sunday, May 13th, 2018, 08:22:28 PM IST

`మ‌హాన‌టి` సావిత్రిని చివ‌రి రోజుల్లో అయిన‌వాళ్లే దారుణంగా మోసం చేశారు. త‌న‌వారిని న‌మ్మి ఆస్తులు రాసిస్తే, తాను క‌ష్ట‌కాలంలో ఉన్నా అణాపైసా సాయానికి కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. ఎంతో న‌మ్మ‌కంగా ప‌ని చేసిన పీఏనే త‌న‌ను దారుణంగా మోస‌గించి, ధ‌న‌వంతుడ‌వుతాడు. చివ‌రికి ఆదాయ‌ప‌న్ను అధికారులు పీడించి, త‌న ఇల్లు దోచేస్తారు. ఆస్తుల్ని వేలం వేస్తారు. అలాంటి స‌న్నివేశంలో మ‌హాసాధ్వి ఆ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకునేందుకు ఉన్న డ‌బ్బంతా కోల్పోతుంది. అన్ని క‌ష్టాల్లో ఉండీ.. ట్ర‌స్టు కోసం తాను దాచిన సొమ్మును ట‌చ్ చేసేందుకు స‌సేమిరా అంటుంది. దాన‌గుణంలో త‌న‌కు వేరొక‌రు సాటి లేర‌ని నిరూపిస్తుంది.

దాన‌గుణంలో శిబి చ‌క్ర‌వ‌ర్తిని మించిన దేవ‌త సావిత్రి. తాను పేద‌విద్యార్థుల చ‌దువు కోసం.. శ్రీ‌మ‌తి సావిత్రి గ‌ణేష‌న్ జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ (ఎస్ఎస్‌జీహెచ్ హైస్కూల్‌) ని నిర్మించారు. వ‌డ్డివారి పాలెం(రేప‌ల్లె)లో ఈ హైస్కూల్ ఇప్ప‌టికీ ఉంది. స్వ‌గ్రామంలో పేద పిల్ల‌ల చ‌దువుల కోసం సావిత్రి ఈ స్కూల్‌ని నిర్మించారు. అయితే నాటి ప్ర‌భుత్వం టీచ‌ర్ల‌కు జీతాలు చెల్లించ‌లేక ఐదు నెల‌ల బ‌కాయి ప‌డిపోతే, ఆ మాట విని సావిత్రి స్పాట్‌లో 10,4000 జీతాల‌కు చెక్ రాసిచ్చారు.
అంత‌టి తెగువ ఈరోజుల్లో ఎవ‌రికి ఉంటుంది. ల‌క్ష డ‌బ్బు అంటే ఈరోజుల్లో 40ల‌క్ష‌ల‌కు స‌మానం. ఈ మాట‌ను ఎవ‌రో కాదు, ఆ స్కూల్ టీచ‌ర్ల‌కు క‌రెంట్ అకౌంట్ నుంచి జీతాలు చెల్లించిన ఎస్‌బీఐ బ్యాంక్ అధికారి ఒక‌రు ఇటీవ‌ల‌ వెల్ల‌డించారు.

  •  
  •  
  •  
  •  

Comments