జ‌గ‌న్ పై దాడి.. నిందితుడు శ్రీనివాస్‌.. చాప్ట‌ర్ క్లోజ్ చేస్తారా..?

Thursday, November 1st, 2018, 01:35:52 AM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా క‌త్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌ని అంత‌మొందించేందుకు కుట్ర‌ప‌న్నుతున్నార‌ని అనంత‌పురం మాజీ ఎంపీ అనంత వెంక‌ట రామిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జ‌గ‌న్‌ను చంపేందుకు భారీగా కుట్ర జ‌రుగుతోంద‌ని.. అందులో భాగంగానే విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జ‌రిగింద‌ని.. అయితే తృటిలో జ‌గ‌న్ త‌ప్పించుకున్నార‌ని.. దీంతో ఎక్క‌డ నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో అని నిందితుడు శ్రీనివాస్‌ను చంపి.. జ‌గ‌న్ పై దాడి కేసును క్లోజ్ చేయాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ వేస్తున్నార‌ని అనంత వెంక‌ట రామిరెడ్డి ఆరోపించారు.

ఇక జగన్ పై దాడి చేసినప్పుడు.. ఆరోగ్యంగా, బలంగా ఉన్న శ్రీనివాస్.. అస్వస్తతకు గురయ్యాడని విశాఖ పోలీసులు అత‌న్ని భుజాల పై వేసుకొని మ‌రీ విశాఖ‌ కేజీహెచ్‌కి త‌ర‌లించ‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. అంతే కాకుండా శ్రీనివాస్ పోలీసు జీపులో కూర్చుని త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని కేక‌లు వేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని వెంక‌ట రామిరెడ్డి అన్నారు. నిందితుడు మీడియా ముందుకు వ‌స్తే త‌మ భాగోతాలు బ‌య‌ట ప‌డిపోతాయ‌ని.. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు శ్రీనివాస్‌ను చంపేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఇక మాట్లాడితే 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం, 13 ఏళ్ళు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబు.. ఆప‌రేష‌న్ గ‌రుడలో భాగంగానే జ‌గ‌న్ పై దాడి జ‌రిగింద‌ని చెప్ప‌డం సిగ్గు చేట‌ని వెంక‌ట రామిరెడ్డి మండి ప‌డ్డారు. మ‌రి ఈ మాజీ ఎంపీ వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments