ఈరోజు నగరానికి రానున్న శ్రీనివాస్ మృతదేహం !

Monday, February 27th, 2017, 10:12:42 AM IST


గత వారం అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని ఓలాతెలో జరిగిన జాతి విద్వేష కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ జాత్యాహంకార హత్యతో యావత్ భారతం కలవరపడింది. ఆమెరికాలో చదువుకుంటున్న తమ పిల్లలను, నివసిస్తున్న బంధువులను వెంటనే తిరిగొచ్చేయాలని ఇక్కడి వారు కోరుతున్నారు. ఇకపోతే శ్రీనివాస్ మృతదేహాన్ని ఈరోజు నగరానికి తీసుకురానున్నారు. ఇంకో మూడు నెలలో ఇండియాకు తితిగి రావాల్సిన శ్రీనివాస్ ఇలా శవంగా ఇంటికి చేరనుండటంతో శ్రీనివాస్ నివాస ప్రాంతమైన బౌరంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈరోజు రాత్రి కార్గో విమానము ద్వారా శ్రీనివాస్ మృతదేహం నగరానికి రానుంది. శ్రీనివాస్ వెంట ఆయన సతీమణి, సోదరుడు, అతని భార్య, స్నేహితుడు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాంగ వ్యవహారాల శాఖ చాలా బాధ్యతాయుతంగా స్పందించిందని, అందుకు తమ కృతజ్ఞతలని శ్రీనివాస్ కుటుంబం తెలిపింది. మరోవైపు అమెరికాలోని పీటం నగరంలో మరొక భారతీయుడి ఇంటిపై కూడా కొందరు అమెరికన్లు దాడి చేసినట్టు తెలుస్తోంది.